Naga Babu: భిన్నాభిప్రాయాలున్నా మా బంధం ప్రత్యేకం.. నాగబాబు ఎమోషనల్‌ పోస్ట్

Eenadu icon
By Entertainment Team Updated : 03 Nov 2023 11:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు వరుణ్‌ తేజ్‌  (Varun Tej)- లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ వివాహంలో మెగా బ్రదర్స్‌ నాగబాబు, చిరంజీవి(Chiranjeevi), పవన్‌ కల్యాణ్‌ల (Pawan Kalyan) ఫొటో వైరల్‌గా మారింది. నాగబాబు ఈ ఫొటోను షేర్‌ చేస్తూ అన్నదమ్ముల బంధం గురించి ఓ ఎమోషనల్‌ నోట్‌ రాశారు.

‘‘మా మధ్య ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా.. మా అన్నదమ్ముల బంధం ఎప్పటికీ ప్రత్యేకమైనదే. ఈ ఫొటో ఓ జ్ఞాపకం మాత్రమే కాదు అంతకు మించింది. మా మధ్య ఉన్న అభిప్రాయ భేదాల కంటే లోతైన అనుబంధం చాలా ముఖ్యమైనది. ప్రేమతో కూడిన ఎన్నో మధుర క్షణాలతో ఈ రిలేషన్‌ ముడిపడి ఉంది. ఇది ఎప్పటికీ విడదీయరానిది. బలమైనది. దీనికి నేనెంతో విలువనిస్తాను’’ అంటూ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ ఫొటో చూసిన మెగా ఫ్యాన్స్‌ సంబర పడుతున్నారు. ‘పిక్చర్ పర్‌ఫెక్ట్‌’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

వైద్య రిపోర్టులో అంతా సరిగా ఉన్నట్లే వచ్చింది.. కానీ అలా జరిగింది: సుస్మితా సేన్‌

ఇటలీ వేదికగా నవంబర్‌ 1న వరుణ్‌-లావణ్యల వివాహం జరిగింది. కుటుంబసభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొందరు హీరోలు దీనికి హాజరయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే దీని కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి.

Tags :
Published : 03 Nov 2023 10:58 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు