Nagarjuna: ‘మనం’ విషయంలో ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది: నాగార్జున

‘మనం’ సినిమా విషయంలో తనకు ఓ బాధ ఎప్పటికీ ఉంటుందన్నారు నటుడు అక్కినేని నాగార్జున.

Published : 23 May 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్కినేని హీరోలంతా కలిసి నటించిన చిత్రం ‘మనం’ (Manam). 2014 మే 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది. పదేళ్లు పూర్తయిన సందర్భంగా (10 years of manam movie) గురువారం ఈ సినిమాని పలు థియేటర్లలో రీ రిలీజ్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున (Nagarjuna) సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియో పంచుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘‘మా కుటుంబానికి ఈ సినిమా ఎంతో ప్రత్యేకం. నాన్న ఆఖరి చిత్రమిది. ఎలాగైనా ఈ మూవీ క్లాసిక్‌గా నిలవాలని అనుకునేవారాయన. టీమ్‌ వర్క్‌తో అనుకున్నదే జరిగింది. దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌.. ఇలా ఈ చిత్రానికి పని చేసిన వారందరికీ స్పెషల్‌ థ్యాంక్స్‌. కాస్త ఇబ్బంది పడుతూనే నాన్న సెట్స్‌కు వచ్చేవారు. మా అందరినీ నవ్వించేవారు. ఆయనకు పెద్ద స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని చూపించలేకపోయాననే బాధ ఎప్పటికీ ఉంటుంది’’ అని అన్నారు.

దర్శకుడు విక్రమ్‌ సైతం ఆ సినిమా జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ‘‘నాగేశ్వరరావు సర్‌కి స్క్రిప్టు వినిపించే సమయంలో.. నా చేయి తగిలి టేబుల్‌పై ఉన్న గ్లాసు కిందపడి పగిలిపోయింది. ఆ శబ్దానికి అక్కడ పనిచేసే కొందరు బాయ్స్‌ ఏం జరిగిందో అనుకుంటూ కంగారుగా వచ్చారు. డోర్‌ దగ్గర ఉన్నవారిని లోపలికి రావొద్దని ఏయన్నార్‌ చెప్పారు. కథలో అంతగా లీనమయ్యారాయన. నేను స్టోరీ చెప్పడం పూర్తయ్యాక వాళ్లు రూమ్‌ క్లీన్‌ చేశారు. ఆ క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు