Amitabh Bachchan: అశ్వత్థామగా అమితాబ్‌

‘‘ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను. ద్రోణాచార్య తనయుడిని’’ అంటూ అశ్వత్థామ పాత్రలో పరిచయం అయ్యారు అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌.

Updated : 22 Apr 2024 12:18 IST

‘‘ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను. ద్రోణాచార్య తనయుడిని’’ అంటూ అశ్వత్థామ పాత్రలో పరిచయం అయ్యారు అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌. ఆయన ‘కల్కి 2898 ఎ.డి’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రని పరిచయం చేస్తూ ఆదివారం ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ‘నీకు మరణం లేదా? నువ్వు దేవుడివా? నువ్వు ఎవరు?’ అంటూ ఓ చిన్నారి ప్రశ్నించగా, తన పాత్రని పరిచయం చేస్తూ కనిపిస్తారు అమితాబ్‌ బచ్చన్‌. ప్రభాస్‌ కథానాయకుడిగా... నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌తోపాటు కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పురాణాలు, సైన్స్‌ ఫిక్షన్‌ అంశాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు కానీ, విడుదల తేదీపై ఇంకా స్పష్టతనివ్వలేదు చిత్రబృందం. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ సినిమా, మరెవ్వరికీ లేని అనుభవాన్ని తనకు పంచిందంటూ అమితాబ్‌ బచ్చన్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు