Nani: స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి

నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి.

Updated : 20 Apr 2024 11:27 IST

హైదరాబాద్‌: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇటీవల నటి, గాయని స్మిత (Smita) నివాసంలో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు నాని (Nani) - అంజనా దంపతులు సందడి చేశారు. స్వామివారికి తలంబ్రాలు పోశారు. ఈ వీడియోను స్మిత తాజాగా విడుదల చేశారు.

జెర్సీకి ఐదేళ్లు..!

నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ సినిమా విడుదలై శుక్రవారంతో ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా నాని సతీమణి అంజనా ఇన్‌స్టాలో స్పెషల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘‘తొలిసారి థియేటర్‌లో ఆ సినిమా చూసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా  ఆ సీన్స్‌ నన్ను భావోద్వేగానికి గురిచేస్తాయి. మా అబ్బాయి అర్జున్‌ ఇప్పుడిప్పుడే ‘జెర్సీ’ థీమ్‌ సాంగ్‌ పియానోపై ప్లే చేయడం నేర్చుకుంటున్నాడు’’ అని ఆమె రాసుకొచ్చారు.

నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ కోసం వర్క్‌ చేస్తున్నారు. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలతో నాని మరో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు