Nani: పీరియాడిక్‌ ప్రేమకథలో నాని

బలగం’ సినిమాతో తొలి అడుగులోనే దర్శకుడిగా సినీప్రియుల్ని మెప్పించారు వేణు యెల్దండి. ఇప్పుడాయన తన రెండో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Updated : 26 Jan 2024 09:36 IST

‘బలగం’ సినిమాతో తొలి అడుగులోనే దర్శకుడిగా సినీప్రియుల్ని మెప్పించారు వేణు యెల్దండి. ఇప్పుడాయన తన రెండో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించనున్నారు. నాని కథానాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయినట్లు తెలిసింది. ఈ సినిమా ఓ పీరియాడిక్‌ ప్రేమకథతో రూపొందనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని పల్లెటూరిలో నేపథ్యంగా ఉంటుందని టాక్‌. ప్రస్తుతం నాని చేస్తున్న ‘సరిపోదా శనివారం’ పూర్తి కాగానే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని ప్రచారం వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని