Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా శనివారం’ టీజర్‌ రిలీజ్‌.. ఆ ఒక్క రోజు సరిపోదా?

కథానాయకుడు నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Updated : 24 Feb 2024 14:39 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన కథా నాయకుడు నాని (Nani). గతేడాది విడుదలైన ‘హాయ్‌ నాన్న’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. ఇందులో నాని మాస్‌లుక్‌లో కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఎస్.జె.సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు.

శనివారం నాని పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయన పాత్రను పరిచయం చేస్తూ టీజర్‌ విడుదల చేసింది. ‘‘కోపాన్ని కూడా ఓ పద్ధతిలో చూపించేది నేనే. నా పేరు సూర్య. కోపం చూపించడానికి ఆ ఒక్క రోజు చాలు’ అంటూ నాని మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  మరోవైపు ‘బలగం’ సినిమాతో దర్శకుడుగా మంచి గుర్తింపు అందుకున్న వేణు దర్శకత్వంలోను నాని నటించనున్నారట. పీరియాడికల్ ప్రేమకథగా దీనిని రూపొందించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని