Nani: గుండె బరువెక్కింది..: నాని ఎమోషనల్‌ పోస్ట్‌

నటుడు నాని (Nani) కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’ (Jersey). 2019లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది.

Updated : 21 Apr 2024 10:52 IST

హైదరాబాద్‌: నటుడు నాని (Nani) కెరీర్‌లోని సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘జెర్సీ’ (Jersey) ఒకటి. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన క్రికెటర్‌గా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై శుక్రవారంతో ఐదేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో ‘జెర్సీ’ స్పెషల్‌ షో వేశారు. దీనికి, నాని-అంజనా దంపతులు హాజరయ్యారు. అభిమానులు చూపిస్తోన్న ఆదరణ పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

‘‘ఈరోజు నాకెంతో భావోద్వేగంగా ఉంది. అభిమానులు ఆదరణ చూస్తుంటే.. మళ్లీ తన ప్రయాణాన్ని ఆస్వాదించడం కోసం అర్జున్‌ (సినిమాలో తన పాత్ర పేరు) తిరిగి భూమ్మీదకు వచ్చినట్టుంది. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయింది’’ అని ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు.

అంజనా సైతం ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘తొలిసారి థియేటర్‌లో ఆ సినిమా చూసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఆ సీన్స్‌ నన్ను భావోద్వేగానికి గురిచేస్తాయి. మా అబ్బాయి అర్జున్‌ ఇప్పుడిప్పుడే ‘జెర్సీ’ థీమ్‌ సాంగ్‌ పియానోపై ప్లే చేయడం నేర్చుకుంటున్నాడు’’ అని రాసుకొచ్చారు.

నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ కోసం వర్క్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయికగా కనిపించనున్నారు. ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల, ‘బలగం’ ఫేమ్‌ వేణుతో నాని సినిమాలు చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని