King of Kotha: దుల్కర్‌ సల్మానే పాన్‌ ఇండియా యాక్టర్‌: నాని

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హీరోలు నాని, రానా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Published : 13 Aug 2023 22:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనకు తెలిసిన నటుల్లో దుల్కర్‌ సల్మానే (Dulquer Salmaan) పాన్‌ ఇండియా యాక్టర్‌ అని టాలీవుడ్‌ హీరో నాని (Nani) అన్నారు. ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ (King of Kotha) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. దుల్కర్ హీరోగా అభిలాష్‌ జోషిలీ తెరకెక్కించిన చిత్రమిది. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. త్వరలోనే (ఆగస్టులో) ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. నానితోపాటు దగ్గుబాటి రానా (Rana Daggubati) ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

‘‘దుల్కర్‌ ప్రయాణంలో నేనూ ఓ భాగమనిపిస్తుంటుంది. అతడు నటించిన ‘ఒకే బంగారం’ సినిమాలో తన పాత్రకు నేను డబ్బింగ్‌ చెప్పా. ఇప్పుడు ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత స్వప్న కూతురు వైజయంతీ దుల్కర్‌కు పెద్ద అభిమాని. షూటింగ్‌కు వస్తావా? అని అడిగితే దుల్కర్‌ ఉంటాడా అని అడిగింది. ‘మనం కూడా లవ్‌స్టోరీలపై దృష్టిసారించాలి’ అని ఇలాంటప్పుడే అనిపిస్తుంటుంది. పాన్‌ ఇండియా సినిమా అనే పదం నాకు అంతగా నచ్చదు. కానీ, పాన్‌ ఇండియా యాక్టర్‌ అంటే నాకు తెలిసినంత వరకు దుల్కరే. ఎందుకంటే అన్ని చిత్ర పరిశ్రమల దర్శకులు దుల్కర్‌ కోసం కథ రాసుకుంటారు’’ అని అన్నారు. రానా మాట్లాడుతూ.. ‘‘యాక్టింగ్‌ స్కూల్‌లో దుల్కర్‌ నా జూనియర్‌. దుల్కర్‌ యాక్షన్‌ సినిమా చేస్తున్నాడనగానే ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ నాకు ఆసక్తి కలిగింది’’ అని తెలిపారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని