Nani: హిట్టు కలయిక మరోసారి

గతేడాది నానికి దక్కిన విజయాల్లో ‘దసరా’ ఒకటి. సుధాకర్‌ చెరుకూరి నిర్మాణంలో శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకోవడమే కాక భారీ వసూళ్లు రాబట్టింది.

Updated : 31 Mar 2024 13:40 IST

తేడాది నానికి దక్కిన విజయాల్లో ‘దసరా’ ఒకటి. సుధాకర్‌ చెరుకూరి నిర్మాణంలో శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకోవడమే కాక భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడిదే కలయికలో మరో చిత్రం తెరపైకి రానుంది. ‘దసరా’ విడుదలై శనివారంతో ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రీలుక్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఎరుపు రంగుతో నిండి ఉన్న ఆ ప్రచార చిత్రంలో నాని గడ్డం, మెలితిప్పిన మీసాలతో మాస్‌ లుక్‌లో కనిపించారు. ‘‘నాయకుడిగా ఉండటానికి గుర్తింపు అవసరం లేదు’’ అంటూ ఆ పోస్టర్‌పై ఓ ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. ‘‘విప్లవం ప్రారంభమయ్యే ముందు హింస దాని సరైన రూపాన్ని తీసుకుంటుంది’’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ కూడా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీన్ని బట్టి శ్రీకాంత్‌ ఈసారి నాని కోసం మరో భారీ మాస్‌ యాక్షన్‌ కథాంశాన్ని సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. ‘నాని 33’ వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని ప్రస్తుతం వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ చిత్రం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని