Nayanthara: నయన్‌... నాయికా ప్రాధాన్య చిత్రం?

ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ.

Updated : 28 Mar 2024 12:20 IST

కర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఇప్పటికే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ సుందరి ఇటీవలే ‘జవాన్‌’తో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని కూడా తనవైపు తిప్పుకుంది. వరుస అవకాశాలతో జోరు చూపిస్తున్న ఈమె మరో నాయికా ప్రాధాన్యమైన సినిమాలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. తమిళంలో ‘సుబ్రమణ్యపురం’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న శశికుమార్‌తో ఆమె ఓ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ‘సుబ్రమణ్యపురం’తో దర్శకరంగంలోకి అడుగుపెట్టిన శశి 2010లో మరో ప్రాజెక్టు చేశారు. 14ఏళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్‌ పట్టి నయనతో ఈ ప్రాజెక్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. ఈమె కూడా ఇందులో భాగమయ్యేందుకు ఆసక్తి చూపుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు