Nayanthara: నయనతార కొత్త చిత్రం?

ఎలాంటి పాత్రలోనైనా తన నటనతో సినీప్రియుల్ని మెప్పిస్తుంటుంది అందాల తార నయనతార.

Published : 24 May 2024 01:25 IST

లాంటి పాత్రలోనైనా తన నటనతో సినీప్రియుల్ని మెప్పిస్తుంటుంది అందాల తార నయనతార. వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఈ భామ.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ప్రముఖ నిర్మాణ సంస్థ 7స్క్రీన్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఓ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన ‘విక్రమ్‌’, ‘మాస్టర్‌’ లాంటి విజయవంతమైన సినిమాలకు సాహిత్యం అందించిన విష్ణు...ఈ సినిమాతో దర్శకుడిగా తొలి అడుగు వేయబోతున్నారు. ప్రస్తుతం నయన్‌తో చర్చలు జరుపుతోంది చిత్రబృందం. ఇందులో ‘దాదా’ సినిమాతో ప్రశంసలు అందుకున్న తమిళ కథానాయకుడు కవిన్‌ రాజ్, సత్యరాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్క్రిప్ట్‌ పనులు ముగింపు దశలో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి త్వరలో అధికారికంగా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నార’’ని నిర్మాణ సంస్థ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ‘డియర్‌ స్టూడెంట్స్‌’ చిత్రీకరణలో ఉంది నయన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని