Rana Naidu: ఆర్ యూ రెడీ ఫర్ ‘రానా నాయుడు-2’.. అధికారికంగా వెల్లడి
‘రానా నాయుడు’ (Rana Naidu) సీజన్ 2కు రంగం సిద్ధమైంది. త్వరలో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
ఇంటర్నెట్‌డెస్క్: రానా (Rana), వెంకటేశ్ (Venkatesh) ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ సూపర్‌హిట్ వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ సిరీస్ అత్యధిక వ్యూస్‌తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడిదే సిరీస్‌కు సీక్వెల్‌గా ‘రానానాయుడు -2’ రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ టీమ్ బుధవారం అధికారికంగా వెల్లడించింది. మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌కు విశేష ప్రేక్షకాదరణ లభించిందని దానిని దృష్టిలో ఉంచుకునే సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ బృందం తెలిపింది. మరెన్నో ట్విస్టులు, మరింత ఫ్యామిలీ డ్రామాతో ‘రానా నాయుడు-2’ త్వరలో విడుదల కానున్నట్లు ప్రకటించింది. దీనిపై పలువురు సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డొనోవన్’కు రీమేక్‌గా ఇది సిద్ధమైంది. రానా, ఆయన బాబాయ్ వెంకటేశ్ మొదటిసారి ఈ సిరీస్ కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా సిద్ధమైన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీకొడుకులుగా నటించారు. బాలీవుడ్ సెలబ్రిటీల సమస్యలు తీర్చే వ్యక్తిగా రానా కనిపించారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. లోకోమోటీవ్ గ్లోబల్ మీడియా పతాకంపై సుందర్ ఆరోన్ నిర్మించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చిలో విడుదలైన ఈ సిరీస్ అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే, ఇందులో బోల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉందని పలువురు సినీ ప్రియులు విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ