Raghava Lawrence: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్‌.. నెటిజన్ల ప్రశంసలు

నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు.

Updated : 18 Apr 2024 12:31 IST

చెన్నై: దివ్యాంగులు, అనాథ బాలల కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. దివ్యాంగుల కోసం ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి ఇచ్చారు. 

‘‘దివ్యాంగులైన వీరందరూ మల్లరకంభంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని ఇటీవల నేనొక ప్రెస్‌మీట్‌లో చెప్పిన విషయం తెలిసిందే. చేసే పని పట్ల వారికి ఉన్న పట్టుదల చూసి సంతోషిస్తున్నాను. వారందరికీ బైక్స్‌ ఇవ్వడంతోపాటు ఇళ్లు కట్టిస్తానని నేను మాటిచ్చా. అందులో భాగంగా 13 ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేశా. వారికి ఉపయోగపడేలా ఆ వాహనాలను త్రీవీలర్స్‌గా మార్పించనున్నాం. అదే విధంగా, ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే ఇళ్లు కూడా నిర్మిస్తా’’ అని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పంచుకొన్నారు. రాఘవ చేసిన పనితో వారందరూ ఆనందం వ్యక్తం చేశారు. మనసుని హత్తుకునే ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆయన్ను మెచ్చుకున్నారు.

కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాఘవ ‘స్పీడ్‌ డ్యాన్సర్‌’తో నటుడిగా మారారు. ‘కాంచన’ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన ‘చంద్రముఖి 2’లో సెంగోటయ్యగా కనిపించారు. ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. గతేడాది విడుదలైన ‘జింగర్తాండ డబుల్‌ ఎక్స్‌’ లారెన్స్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.  ప్రస్తుతం ఆయన ‘దుర్గ’ కోసం వర్క్ చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని