Skanda: స్కంద జోరు

‘స్కంద’గా సందడి చేసేందుకు చకచకా ముస్తాబవుతున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

Updated : 13 Aug 2023 14:01 IST

‘స్కంద’గా సందడి చేసేందుకు చకచకా ముస్తాబవుతున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది. ఇందులో భాగంగా తమన్‌ నేపథ్య సంగీత పనుల్ని ప్రారంభించారని సమాచారం. మరోవైపు డబ్బింగ్‌ పనులతో పాటు ఆఫ్‌లైన్‌ ప్రమోషన్స్‌ను పరుగులు పెట్టిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే శనివారం ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్లను విడుదల చేశారు. వాటిలో ఒకదాంట్లో రామ్‌ యాక్షన్‌ లుక్‌లో కనిపించగా.. మరొక దాంట్లో శ్రీలీలతో కలిసి రొమాంటిక్‌గా కనిపించారు.

ఇప్పటికే ఆయన డబ్బింగ్‌ పనులు పూర్తి చేసినట్లు తెలిసింది. నెలాఖరున ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘‘మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోన్న ఈ సినిమాలో రామ్‌ రెండు కోణాల్లో కనిపించనున్నారు. మునుపెన్నడూ చూడని మాస్‌ గెటప్పుల్లో సందడి చేయనున్నారు’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా సెప్టెంబరు 15న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సంతోష్‌ డిటాకే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని