
Updated : 21 Jan 2022 07:06 IST
Nallamala: మన్నిస్తారా మూగజీవులారా...
అమిత్ తివారి, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. రవిచరణ్ దర్శకుడు. ఆర్.ఎమ్ నిర్మాత. ‘మన్నిస్తారా మూగజీవులారా ...’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సరికొత్త నేపథ్యంలో ఆసక్తికరంగా తీశారని ఈ సినిమా ప్రచార చిత్రాల్ని చూసినప్పుడంతా అనిపించేది. మన్నిస్తారా మూగజీవులారా... పాట చాలా బాగుంది. ప్రతీ లైన్ హృదయాల్ని కదిలిస్తుంది. జంతువుల విషయంలో మనం ఎంత అమానుషంగా ఉంటున్నామో అర్థమవుతుంది. ఇలాంటి అంశాన్ని ఎంచుకున్న నల్లమల బృందాన్ని అభినందిస్తున్నా’’ అన్నారు. అజయ్ ఘోష్, కాశీ విశ్వనాథ్, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, శుభోదయం రాజశేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం, పాటలు: పీఆర్, ఛాయాగ్రహణం: వేణు మురళి.
Advertisement
Tags :