Skanda: కోలమ్మ.. కొండ కోనమ్మ

‘‘డుమ్మారే డుమ్మా డుమ్మారే... సూటిగా ఉంటది మా తీరే...  మట్టి తల్లి బొట్టుగ మారే పచ్చదనాలే పల్లెటూరులే...’’ అంటూ పల్లెసీమల అందాన్ని... అక్కడి మనుషుల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించింది ‘స్కంద’ చిత్రంలోని పాట. రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీలీల, సయీ మంజ్రేకర్‌ కథానాయికలు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 31 Aug 2023 14:16 IST

‘‘డుమ్మారే డుమ్మా డుమ్మారే... సూటిగా ఉంటది మా తీరే...  మట్టి తల్లి బొట్టుగ మారే పచ్చదనాలే పల్లెటూరులే...’’ అంటూ పల్లెసీమల అందాన్ని... అక్కడి మనుషుల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించింది ‘స్కంద’ చిత్రంలోని పాట. రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీలీల, సయీ మంజ్రేకర్‌ కథానాయికలు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 15న తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రంలోని ‘డుమ్మారే డుమ్మా...’ అంటూ సాగే పాటని బుధవారం విడుదల చేశారు. ‘‘కోలమ్మ కోలో కొమ్మ గుమ్మంలో గువ్వా గువ్వా... కొండ కోనమ్మ మజ్జెల్లో వాగమ్మ పాటే మువ్వా మువ్వా...’’ అంటూ సాగే ఈ పాటని కల్యాణ చక్రవర్తి రచించగా, అర్మాన్‌ మాలిక్‌, అయ్యన్‌ ప్రణతి ఆలపించారు. తమన్‌ స్వరకర్త. రామ్‌, సయీ మంజ్రేకర్‌లపై చిత్రీకరించిన ఈ పాట పల్లెటూరి గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుంది. ‘‘సందర్భానికి తగ్గట్టుగా మంచి పాటలున్న చిత్రమిది. తొలి రెండు పాటలకి మంచి స్పందన లభించింది. మూడో పాటగా వచ్చిన డుమ్మారే డుమ్మా... అందరినీ అలరిస్తోంది. తెరపై ఈ పాటలు మరింత ఉత్సాహాన్ని పంచుతాయి. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకూ చక్కటి వినోదం పంచుతుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. శ్రీకాంత్‌, గౌతమి, ప్రిన్స్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సంతోష్‌ డిటాకే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని