Pushpa 3: ‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!

‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది.

Updated : 28 Mar 2024 20:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన ‘పుష్ప’ రికార్డులను సృష్టించింది. ఈ చిత్రానికి గాను హీరో, సంగీత దర్శకుడు నేషనల్‌ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ కథ మూడో పార్ట్‌కు (Pushpa 3) సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి ‘పుష్ప: ది రోర్‌’ అనే టైటిల్‌ పెట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం బన్నీ, సుకుమార్‌లు మూడో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌పై చర్చలు కూడా జరిపారట. మొదటి భాగాన్ని ‘పుష్ప: ది రైజ్‌’తో ప్రారంభించిన చిత్రబృందం దానికి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ను రూపొందిస్తున్నారు. దాని తర్వాత ‘పుష్ప: ది రోర్‌’ పేరుతో పార్ట్‌3 తెరకెక్కించి కథను ముగించనున్నారట.

ఇటీవలే ఈ పార్ట్‌3పై అల్లు అర్జున్‌ కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. అన్నీ అనుకూలంగా ఉంటే పార్ట్‌3 తీసే అవకాశాలున్నాయన్నారు. కథను కొనసాగించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీనిని తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలున్నాయని.. ఇందులో పాత్రల మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటుందన్నారు. బన్నీ ఈ విషయాలను చెప్పినప్పటి నుంచి మూడో భాగానికి సంబంధించిన వార్తలు మొదలయ్యాయి. రోజుకో వార్త సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ‘పుష్ప2’ భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న విడుదల కానుంది. దీని తర్వాత సుకుమార్‌-రామ్‌ చరణ్‌ల సినిమా (#RC17) ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ తర్వాత పుష్ప3 ప్రారంభమవుతుందేమో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని