Nikhil flies off to Vietnam: మూడు నెలలు విదేశాల్లో ఉండనున్న హీరో నిఖిల్‌.. కారణమిదే!

యంగ్‌ హీరో నిఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu). ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశాన్ని నిఖిల్‌ పంచుకున్నాడు.

Updated : 07 Sep 2023 13:23 IST

హైదరాబాద్‌: వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో నిఖిల్‌ (Nikhil Siddhartha). ఇటీవలే  ‘స్పై’ అనే మిస్టరీ థ్రిల్లర్‌తో పలకరించిన ఈ హీరో తాజాగా మరో విభిన్నమైన కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘స్వయంభూ’లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని నిఖిల్‌ పంచుకొన్నాడు.

‘స్వయంభూ’ కోసం మూడు నెలలు వియత్నాంకు వెళ్తున్నట్లు తెలిపిన నిఖిల్‌ (Nikhil flies off to Vietnam) అందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశాడు. ‘‘స్వయంభూ’ కోసం సిద్ధం కానున్నాను. ఆయుధాలు, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ నేర్చుకోనున్నా. వియత్నాంలోని నిపుణుల పర్యవేక్షణలో 3 నెలల పాటు శిక్షణ తీసుకోనున్నా. ఇంత గొప్ప సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఇక ఈ వీడియో చూసిన వారంతా నిఖిల్‌కు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెబుతున్నారు. అలాగే ‘కార్తికేయ 3’కు సంబంధించిన అప్‌డేట్‌ షేర్‌ చేయాలని అభిమానులు కోరుతున్నారు. 

ఈ వారం ఓటీటీలో 20కు పైగా చిత్రాలు/సిరీస్‌లు!

ఇక ఇటీవలే ఈ సినిమాకు పోస్టర్‌ను విడుదల చేయగా అది నెటిజన్లను ఆకట్టుకుంది. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మేనన్‌ నటించనుంది. అలాగే నిఖిల్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా (Swayambhu)ఇది తెరకెక్కనుంది. ఇక దీనితో పాటు సుధీర్‌ వర్మతో నిఖిల్‌ ఓ సినిమా చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ సమర్పణలో ‘ది ఇండియా హౌస్‌’ పేరిట ఇది తెరకెక్కనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని