Nikhil: నిఖిల్.. ‘స్వయంభూ’
నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నిఖిల్ (Nikhil) కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘స్వయంభూ’ (Swayambhu) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి స్వయంగా ఉద్భవించినదని అర్థం. గురువారం నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అందులో ఆయన యుద్ధ భూమిలో శత్రువులతో పోరాడుతున్న యోధుడిలా కనిపించారు. ఈ ప్రచార చిత్రాన్ని బట్టి.. ఇదొక సోసియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది. ‘‘ఇది నిఖిల్‌కు 20వ సినిమా. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రమిది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది. ఆగస్టు నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandra babu arrest: తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకు: నారా లోకేశ్
-
Drugs Case: ఏడేళ్ల క్రితం కాల్ లిస్ట్ ఆధారంగా విచారించారు: సినీనటుడు నవదీప్
-
Keerthy suresh: ముంబయి వీధుల్లో ఆటోరైడ్ చేస్తున్న కీర్తి సురేశ్.. వీడియో వైరల్
-
Chandrababu Arrest: తొలి రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ
-
Team India: ర్యాంకులు ముఖ్యం కాదు.. బలమైన జట్లను ఓడిస్తేనే.. ప్రపంచకప్: గౌతమ్ గంభీర్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు