Karthikeya 3: ‘కార్తికేయ 3’కి రంగం సిద్ధం

సరికొత్త సాహసంతో త్వరలోనే ‘కార్తికేయ 3’ తెరకెక్కనుందనే సంకేతాలిచ్చారు కథానాయకుడు నిఖిల్‌. ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Updated : 18 Mar 2024 11:08 IST

రికొత్త సాహసంతో త్వరలోనే ‘కార్తికేయ 3’ తెరకెక్కనుందనే సంకేతాలిచ్చారు కథానాయకుడు నిఖిల్‌. ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నిఖిల్‌ కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ’, ‘కార్తికేయ2’ చిత్రాలు ఘన విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ‘కార్తికేయ2’ అయితే పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించింది. అప్పట్నుంచి కొనసాగింపు చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. చిత్రబృందం కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ‘కార్తికేయ 3’ రూపొందుతుందని నిఖిల్‌ సామాజిక మాధ్యమాల ద్వారా ధ్రువీకరించారు. చందూ మొండేటి ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడిగా ‘తండేల్‌’ తెరకెక్కిస్తున్నారు. అది పూర్తయ్యాక ‘కార్తికేయ 3’ పట్టాలెక్కే అవకాశాలున్నాయి. మరి ఈసారి డా.కార్తికేయ ఎలాంటి సాహసాలు చేస్తాడో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని