Karthikeya 3: ‘కార్తికేయ 3’.. అధికారికంగా ప్రకటించిన నిఖిల్‌

‘కార్తికేయ 3’ని ఉద్దేశించి నిఖిల్‌ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. త్వరలో ప్రారంభం కానుందన్నారు.

Published : 17 Mar 2024 14:50 IST

హైదరాబాద్‌: దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన ‘కార్తికేయ 2’తో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు నిఖిల్‌ (Nikhil). చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సూపర్‌హిట్‌ అందుకుంది. దీనికి కొనసాగింపుగా రానున్న ‘కార్తికేయ 3’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్‌ చేసే పనిలో డాక్టర్‌ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం’’ అని నిఖిల్‌ తాజాగా పోస్ట్‌ పెట్టారు. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్‌ - చందు కాంబోలో మరో అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ చూసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత చిత్రంతో పోలిస్తే ఇది భారీ స్థాయిలో ఉండనుందని టాక్‌.

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ హీరోగా రానున్న మూడో చిత్రమిది. 2014లో విడుదలైన ‘కార్తికేయ’తో ఈ కాంబో తొలి విజయాన్ని అందుకుంది. ‘కార్తికేయ 2’తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణతత్వం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, అనుపమ్‌ ఖేర్‌, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలు పోషించారు. కృష్ణతత్వాన్ని ఉద్దేశించి అనుపమ్‌ ఖేర్‌ చెప్పే డైలాగ్స్‌ సినిమాకే హైలైట్‌. నిఖిల్‌ ప్రస్తుతం ‘స్వయంభు’ కోసం వర్క్‌ చేస్తున్నారు. ‘తండేల్‌’ పనుల్లో చందు బిజీగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని