SPY Teaser: నేతాజీ మరణం వెనక మిస్టరీని ఛేదించే స్పై

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జీవితానికి సంబంధించి ఎప్పుడూ వినని అంశాలు మా చిత్రంలో ఉంటాయన్నారు నిఖిల్‌.  ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పై’.

Updated : 16 May 2023 11:39 IST

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జీవితానికి సంబంధించి ఎప్పుడూ వినని అంశాలు మా చిత్రంలో ఉంటాయన్నారు నిఖిల్‌.  ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పై’. ఆర్యన్‌ రాజేశ్‌, ఐశ్వర్య మేనన్‌, సన్యా ఠాకూర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్‌ గ్యారీ బి.హెచ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  కె.రాజశేఖర్‌రెడ్డి కథని సమకూర్చడంతోపాటు, ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై స్వయంగా  నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం న్యూ దిల్లీలోని కర్తవ్య పథ్‌లో సోమవారం జరిగింది. భగవాన్‌ జీ ఫైల్‌ మిస్‌ అయ్యింది... అంటూ మొలదయ్యే టీజర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సృష్టికర్త అయిన సుభాష్‌ చంద్రబోస్‌ మరణం, రహస్యాల ఛేదన నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయకుడు నిఖిల్‌ గూఢచారిగా కనిపించనున్నారు. నిఖిల్‌ మాట్లాడుతూ ‘‘కర్తవ్య మార్గ్‌ త్యాగానికి చిహ్నం.  మొదటి టీజర్‌ని నేతాజీ విగ్రహం దగ్గర విడుదల చేసే అవకాశం మాకు రావడం మాకొక గౌరవం. పక్కా యాక్షన్‌తో రూపొందిన ఈ సినిమాలోని ప్రధాన కథాంశం ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది’’ అన్నారు. ఈ ఏడాది జూన్‌ 29న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని