Nikhil Siddhartha: అలా ఉంటే చిత్రాన్ని ఆపేది లేదు: నిఖిల్‌

మంచి కథకు తగ్గట్టు సాంకేతిక విలువలు ఉంటే ఆ చిత్రాన్ని ఆపేది లేదని హీరో నిఖిల్‌ అన్నారు. తన తాజా చిత్రం ‘స్పై’ ట్రైలర్‌ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

Published : 22 Jun 2023 23:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిఖిల్‌ (Nikhil Siddhartha) హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం.. ‘స్పై’ (spy). ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. ఎడిటర్‌ గ్యారీ బి.హెచ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని చిత్ర బృందం గురువారం విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ.. ‘‘కెరీర్‌లో ఎదిగేకొద్దీ బాధ్యత పెరుగుతుందని అర్థమైంది. కొన్నాళ్ల క్రితం వరకు.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. అది అనుకున్న సమయానికి విడుదలవ్వాలని అనుకునేవాణ్ని. కానీ, ఇప్పుడు.. ఓ సినిమాతో సక్సెస్‌ అందుకుంటే తదుపరి చిత్రం హిట్‌ అవ్వాలి అనుకునే పరిస్థితి నెలకొంది. నటుడిగా నాకే ఇలా ఉందంటే స్టార్‌ హీరోలకు ఎలా ఉంటుందో ఊహించగలను. బాధ్యత, ఒత్తిడితో కూడిన పని.. మంచి ఫలితాన్నిస్తుంది. నా గత చిత్రం ‘18 పేజెస్‌’.. క్యూట్‌ లవ్‌స్టోరీ. నేటివిటీని దృష్టిలో పెట్టుకుని దాన్ని కేవల తెలుగు రాష్ట్రాల్లోనే విడుదల చేశాం. ‘స్పై’ని దేశవ్యాప్తంగా రిలీజ్‌ చేయాలని ముందు నుంచీ అనుకుంటున్నాం. ఈ సినిమాపై మాకు నమ్మకం ఉంది. మంచి కథకు తగ్గట్టు సాంకేతిక విలువలు ఉంటే ఆ చిత్రాన్ని ఆపేది లేదు. సెన్సార్‌ పూర్తయిన ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికెట్‌ దక్కిందని తెలియజేసేందుకు ఆనందంగా ఉంది. సినిమాలో కాంట్రవర్సీ ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, దీని ద్వారా మేం ఎవరిని ఇబ్బంది పెట్టడంలేదు. హర్ట్‌ చేయడం లేదు. చరిత్రకు సంబంధించి తెలియని కోణాన్ని చూపించబోతున్నాం. ఈ సినిమాలో హీరో రానా సర్‌ప్రైజ్‌ చేస్తారు’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని