Spy: అనుకున్నట్టే స్పై వస్తున్నాడు

నిఖిల్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది వరకు ప్రకటించినట్లుగానే ఈ సినిమాని ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం మరోసారి స్పష్టత ఇచ్చింది.

Updated : 18 Jun 2023 14:07 IST

నిఖిల్‌ (Nikhil) హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’ (Spy) విడుదలకు సిద్ధమవుతోంది. ఇది వరకు ప్రకటించినట్లుగానే ఈ సినిమాని ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు శనివారం ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘భారత స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ 1945లో ఓ విమాన ప్రమాదానికి గురయ్యారు. ఆ ఘటనతో భారతీయ చరిత్ర బోస్‌ ఆచూకీని కోల్పోయింది. ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. దీని ఆధారంగానే ఎంతో పరిశోధన చేసి ‘స్పై’ కథను సిద్ధం చేశారు నిర్మాత కె.రాజశేఖర్‌ రెడ్డి. దీన్ని అంతే ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు దర్శకుడు గ్యారీ బీహెచ్‌. నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకొని ఈ సినిమా జూన్‌ 29న విజయవంతంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. గ్యారీ బీహెచ్‌ తెరకెక్కించిన ఈ సినిమాని కె.రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారు. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. ఆర్యన్‌ రాజేష్‌, సన్యా ఠాకూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్‌ పాకాల, విశాల్‌ చంద్రశేఖర్‌ సంయుక్తంగా సంగీతమందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని