Nikhil: ‘స్పై’ హంగామా షురూ

‘కార్తికేయ2’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు కథానాయకుడు నిఖిల్‌. ఇప్పుడాయన నుంచి వస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’.

Updated : 07 May 2023 14:13 IST

‘కార్తికేయ2’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు కథానాయకుడు నిఖిల్‌ (Nikhil). ఇప్పుడాయన నుంచి వస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’ (Spy). గ్యారీ బీహెచ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కె.రాజశేఖర్‌రెడ్డి కథ అందించడంతో పాటు స్వయంగా నిర్మిస్తున్నారు. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. సన్యా ఠాకూర్‌, ఆర్యన్‌ రాజేష్‌, జిషు సేన్‌ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని జూన్‌ 29న, టీజర్‌ను ఈనెల 12న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో గ్లింప్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనక దాగి ఉన్న మిస్టరీ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ఆ ప్రచార చిత్రంతో తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని