Ramayana: రామాయణం మొదలు

రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా..యశ్‌ రావణుడిగా..సాయిపల్లవి సీతగా నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న పురాణేతిహాసం ‘రామాయణ’. భారీ తారాగణంతో నిర్మిస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలోనే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన విషయం విదితమే.

Updated : 03 Apr 2024 14:08 IST

ణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా..యశ్‌ రావణుడిగా..సాయిపల్లవి సీతగా నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న పురాణేతిహాసం ‘రామాయణ’. భారీ తారాగణంతో నిర్మిస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలోనే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన విషయం విదితమే. సుదీర్ఘ సన్నాహాల అనంతరం మంగళవారం ముంబయిలోని ఓస్టూడియోలో చిత్రీకరణ మొదలైంది. భారీ జనసమూహం నేపథ్యంలో చిత్రీకరిస్తున్న ఈ సన్నివేశాలు కొద్ది రోజులపాటు కొనసాగనున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. పలు భారతీయ భాషల్లో.. మూడు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు శ్రీరామనవమి రోజైన ఏప్రిల్‌ 17న ప్రకటించే అవకాశముందని సన్నిహితవర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని