Nithiin: ఎవరీ రాబిన్‌హుడ్‌?

తనలోని కొత్త అవతారాన్ని ఆవిష్కరించాడు రాబిన్‌హుడ్‌. ఇన్నాళ్లూ అందరూ అతన్ని ఓ దొంగలా భావిస్తుండగా, ఏజెంట్‌గా తనలోని సాహసోపేతమైన కోణాన్ని బయటికి తీశాడు.

Updated : 31 Mar 2024 13:41 IST

నలోని కొత్త అవతారాన్ని ఆవిష్కరించాడు రాబిన్‌హుడ్‌. ఇన్నాళ్లూ అందరూ అతన్ని ఓ దొంగలా భావిస్తుండగా, ఏజెంట్‌గా తనలోని సాహసోపేతమైన కోణాన్ని బయటికి తీశాడు. మరింతకీ అతను దొంగేనా లేక ఏజెంటా అనేది తెలియాలంటే ‘రాబిన్‌హుడ్‌’ విడుదల వరకు ఎదురు చూడాల్సిందే. నితిన్‌ కథానాయకుడిగా... వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

శనివారం నితిన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘రాబిన్‌హుడ్‌’ కొత్త లుక్‌ని విడుదల చేశారు. ఏజెంట్‌ ఆర్‌.హెచ్‌ అని రాసి ఉన్న షర్ట్‌ ధరించి స్టైలిష్‌గా కనిపించారు నితిన్‌. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌, కళ: రామ్‌కుమార్‌.


‘తమ్ముడు’ వచ్చాడు

కకాలంలో రెండు చిత్రాలు చేస్తున్నారు నితిన్‌. ఒకవైపు ‘రాబిన్‌హుడ్‌’...  మరోవైపు శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో ‘తమ్ముడు’ చేస్తున్నారు. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలు. నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ లోగో, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: బి.అజనీష్‌ లోక్‌నాథ్‌, కూర్పు: ప్రవీణ్‌ పూడి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని