Nora Fatehi: అలాంటి మాటలకు లొంగిపోయే అమ్మాయిని కాదు: నోరా ఫతేహి

తాను 16 ఏళ్ల వయసులోనే సంపాదించడం మొదలుపెట్టినట్లు నటి నోరా ఫతేహి చెప్పారు. ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.

Published : 11 Apr 2024 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి (Nora Fatehi) తెలుగు సినిమాల్లోనూ ఐటమ్స్‌ సాంగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. మోడల్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా మాత్రమే కాదు.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. 16 ఏళ్ల వయసు నుంచే సంపాదించడం మొదలుపెట్టినట్లు చెప్పారు. దీంతో యవ్వనాన్ని పూర్తిగా ఆస్వాదించ లేకపోయినట్లు తెలిపారు.

‘‘కొందరు నటులు అవకాశాలు ఇప్పిస్తామని నాతో చెప్పి దగ్గరవ్వాలని చూస్తుంటారు. నేను అలాంటివాటికి లొంగిపోయే అమ్మాయిని కాదు. పని కోసం ఏదైనా చేసే రకం కాదని వాళ్లకు మొహం మీదే చెబుతాను. ఇలా ముక్కుసూటిగా ఉండడం వల్లే నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంతమంది దాన్ని అర్థం చేసుకోగలరు. మరికొందరు మాత్రం కోపం పెంచుకుంటారు. వాళ్ల సినిమాల్లో నేను ఉన్నానని తెలియగానే.. ‘ఆమె ఎందుకు వచ్చింది. ఆమెను ఇందులోకి ఎందుకు తీసుకుంటున్నారు’ అని గోల చేస్తారు. నాకు అవకాశాలు రావడం వాళ్లకు నచ్చదు. బెదిరిస్తుంటారు. కించపరిచేలా మాట్లాడుతుంటారు. బాలీవుడ్‌లో ఆ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి’’ అని చెప్పారు.

ఇక 2014లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం రోర్‌: టైగర్స్‌ ఆఫ్‌ ది సుందర్‌బన్స్‌ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు నోరా ఫతేహి. ఆ తర్వాత తెలుగులోనూ ‘టెంపర్‌’, ‘బాహుబలి’, ‘కిక్‌2’ తదితర సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్‌లతో అలరించారు. అలాగే ‘బిగ్‌ బాస్‌’, ‘జలక్‌ దిఖల్‌జా సీజన్‌ 9’ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం పలు డ్యాన్స్ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని