Nora Fatehi: సినిమాల్లేక డిప్రెషన్‌.. ఆ బాధ నాకు వద్దు: నోరా

ఇండస్ట్రీలో తనకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారన్నారు నటి నోరా ఫతేహి. చేతి నిండా పని లేకపోవడంతో మానసిక కుంగుబాటుకు గురైన వాళ్లను చూశానని చెప్పారు.

Published : 22 Mar 2024 15:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి, న్యాయనిర్ణేత, డ్యాన్సర్‌గా ప్రేక్షకులకు తరచూ వినోదాన్ని అందిస్తున్నారు నోరా ఫతేహి (Nora Fatehi). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినీ పరిశ్రమలో కెరీర్‌ ఎలా ఉంటుందో చెప్పారు. పరిశ్రమ, సామాజిక మాధ్యమాల నుంచి వచ్చే నెగెటివిటీని ఎదుర్కోవడం కోసం తనని తాను ఎలా మార్చుకుందో తెలిపారు.

‘‘ఇలా మాట్లాడటం సులభం కాదు. ఇక్కడ మనం ఎవరినీ నిందించడానికి లేదు. పలువురు దర్శక - నిర్మాతలు నటీనటులకు ఒకేతరహా పాత్రలు ఇస్తుంటారు. మీ టాలెంట్‌ను బయట ప్రపంచానికి పరిచయం చేసే సమయం వారికి ఉండదు. తదుపరి ప్రాజెక్టులు, అగ్ర తారలతో పరిచయాలు పెంచుకునేందుకు చూస్తుంటారు. అందువల్ల, నా కెరీర్‌ నా చేతుల్లోనే ఉందని భావించా. నటి, న్యాయనిర్ణేత.. ఇలా ఎన్నో వర్క్స్‌ చేస్తున్నా. మానసిక ఒత్తిడి, బాధ, నెగెటివిటీకి గురికాకుండా ఉండేందుకు ఇదెంతో ఉపయోగపడింది. నా స్నేహితులు చాలామంది  తమ సినిమాలు హిట్‌ కాకపోవడంతో డిప్రెషన్‌కు గురయ్యారు. అవకాశాలు రాకపోతే ఏడ్చారు. ఇలాంటివాటికి దూరంగా ఉండేలా నాకు నేను ధైర్యం చెప్పుకున్నా.  వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకుసాగుతున్నా’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని