NTR: మీ సపోర్ట్‌కు థ్యాంక్స్‌.. అభిమానులపై ఎన్టీఆర్‌ స్పెషల్‌ పోస్ట్‌

అభిమానులకు ఎన్టీఆర్‌ స్పెషల్‌గా థ్యాంక్స్‌ చెప్పారు. తన పుట్టిన రోజు సందర్భంగా పోస్ట్‌ పెట్టారు.

Published : 20 May 2024 18:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్: విశేష అభిమాన గణాన్ని కలిగిన తెలుగు హీరోల్లో ఎన్టీఆర్‌ (NTR) ఒకరు. ఫ్యాన్స్‌ని కుటుంబసభ్యులుగా భావించే ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా స్పెషల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘‘ప్రియమైన అభిమానుల్లారా.. నటుడిగా నా ప్రయాణం మొదలైనరోజు నుంచీ నన్ను సపోర్ట్‌ చేస్తున్నందుకు థ్యాంక్స్‌. మీ అసామాన్య ప్రేమకు కృతజ్ఞుడిని. ఆదివారం విడుదలైన ‘దేవర’ (Devara) పాటకు మీ నుంచి వచ్చిన స్పందన ఎంతో ఆనందాన్నిచ్చింది’’ అని అన్నారు. తన స్నేహితులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమ వారికీ ధన్యవాదాలు తెలిపారు.

ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్‌ గురించి ఈ సంగతులు తెలుసా?

మరోవైపు, సామాజిక మాధ్యమాల వేదికగా తనకు విషెస్‌ చెప్పిన ప్రముఖులకు ఎన్టీఆర్‌ రిప్లై ఇచ్చారు. వారిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, జనసేన అధినేత, నటుడు పవన్‌కల్యాణ్‌, మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ తదితరులున్నారు. ఎప్పటిలానే.. బావ అంటూ అర్జున్‌ను, అన్నా అంటూ మహేశ్‌, బ్రదర్‌ అంటూ చరణ్‌లకు థ్యాంక్స్‌ చెప్పారు. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమే ‘దేవర’. తొలి భాగం అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు