Devara: దేవర రాక ఆ పండక్కే.. రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ అదిరింది

ఎన్టీఆర్‌ తాజా చిత్రం దేవర రిలీజ్‌ డేట్‌ ఖరారైంది.

Published : 16 Feb 2024 16:48 IST

హైదరాబాద్‌: క్రేజీ ప్రాజెక్టు దేవర పార్ట్‌ 1 (Deavra Part 1) కొత్త విడుదల తేదీ ఖరారైంది. విజయదశమి సందర్భంగా అక్టోబరు 10న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం పంచుకున్న పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఎన్టీఆర్‌ (NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇది రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలి భాగాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నట్లు టీమ్‌ గతంలో ప్రకటించింది. తాజాగా న్యూ రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది. వాయిదా వేయడడానికి గల కారణాన్ని తెలియజేయలేదు.

సముద్రతీరం నేపథ్యంలో.. భయం అనే అంశం ప్రధానంగా సాగే ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల.. యాక్షన్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తయినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ తీర్చిదిద్దిన ఫైట్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట. అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ ప్రత్యేకంగా నిలవనుంది. కీలకపాత్రలకు సంబంధించిన టాకీ పార్ట్‌ కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని