Pawan kalyan: ధర్మందే విజయం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వందశాతం స్ట్రైక్‌ రేట్‌తో విజయకేతనం ఎగరేయడం ఇటు సినీవర్గాల్లోనూ.. అటు ఆయన అభిమానుల్లోనూ జోష్‌ను నింపింది.

Published : 05 Jun 2024 01:09 IST

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వందశాతం స్ట్రైక్‌ రేట్‌తో విజయకేతనం ఎగరేయడం ఇటు సినీవర్గాల్లోనూ.. అటు ఆయన అభిమానుల్లోనూ జోష్‌ను నింపింది. ఈ నేపథ్యంలోనే పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఓజీ’ చిత్ర బృందం మంగళవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో పవన్‌ చలువ కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్‌గా కుర్చీలో కుర్చోని కనిపించారు. ‘‘ఎవ్వరికీ అందదు అతని రేంజ్‌.. రెప్ప తెరిచేను రగిలే రివేంజ్‌’’ అంటూ ఆ పోస్టర్‌కు ఓ ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది చిత్ర బృందం. సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో.. ఓజాస్‌ గంభీర అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు పవన్‌. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇక ప్రస్తుతం పవన్‌ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం నుంచి కూడా మంగళవారం ఓ కొత్త పోస్టర్‌ బయటకొచ్చింది. ‘ధర్మందే విజయం’ అంటూ పవన్‌కు ఆ చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని