Narendra Modi Biopic: మరో ‘నరేంద్ర మోదీ బయోపిక్’.. ఈసారి యాక్టర్‌ ఎవరంటే?

ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా మరో సినిమా తెరకెక్కనుంది.

Published : 18 May 2024 17:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్స్‌కు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. దీన్ని దృష్టిలోపెట్టుకుని పలువురు దర్శక, నిర్మాతలు ప్రముఖుల జీవితాలను తెరపైకి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే మరోసారి.. ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌ (Narendra Modi Biopic)కు రంగం సిద్ధమైనట్టు సమాచారం. అందులో ప్రముఖ నటుడు సత్యరాజ్‌ (Sathyaraj) నటించనున్నారని కోలీవుడ్‌ వర్గాల టాక్‌. ‘బాహుబలి’లో కట్టప్పగా సత్యరాజ్‌ విశేష క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అందుకే పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దర్శకుడి వివరాలు తెలియాల్సిఉంది.

మోదీ జీవితంపై గతంలో ఓ సినిమా తెరకెక్కింది. ‘పీఎం నరేంద్ర మోదీ’ (PM Narendra Modi) పేరుతో రూపొందిన ఆ హిందీ చిత్రంలో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్ర పోషించారు. ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని