Anil Sunkara: నన్ను కష్టపెట్టగలరేమో.. భయపెట్టలేరు: నిర్మాత అనిల్‌ సుంకర

తాను నిర్మించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ ప్రమోషన్స్‌లో అనిల్‌ సుంకర మాట్లాడారు.

Published : 15 Feb 2024 22:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనను ఎవరైనా కష్టపెట్టగలరేమోగానీ భయపెట్టలేరని నిర్మాత అనిల్‌ సుంకర (Anil Sunkara) అన్నారు. తాను నిర్మించిన ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా, గతంలో నిర్మించిన ‘ఏజెంట్‌’ చిత్రం న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ‘మీ సినిమాలకే ఇలా ఎందుకు జరుగుతోంది?’ అని విలేకరి అడగ్గా అనిల్‌ స్పందించారు.

‘‘ఎక్కువ మంది కాదు ఒక్కరే అలా చేశారు. ఒక వ్యక్తి నా దగ్గర సినిమా కొని, నష్టపోయాడనే అసంతృప్తి నాకెప్పుడూ ఉంటుంది. తను డబ్బులు ఇచ్చాడా, లేదా? అనే సంగతి ఇండస్ట్రీకి తెలుసు. అతడికి నష్టపరిహారం కింద నేనేం ఇవ్వాల్సిన అవసరంలేదు. ఏ రంగంలోనైనా లాభనష్టాలు ఉంటాయి. లాభమొస్తే క్రెడిట్‌ మాదే అనుకుని, నష్టమొస్తే ఇతరులపై తోసేయడం పద్ధతి కాదు. సినిమాని ఆపడానికి ఆయన కేసు వేయలేదు, నన్ను ఆపేందుకు వేశారు. నన్ను కష్టపెట్టగలరేమోగానీ భయపెట్టలేరు. సదరు వ్యక్తిపై నాకు ద్వేషం, పగలాంటివి లేవు. అతడు కోర్టు కేసుల్లో భాగంగా రూ.లక్ష పోగొట్టుకుంటే నాకు రూ.లక్ష నష్టం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. సందీప్‌ కిషన్‌ హీరోగా వి.ఐ. ఆనంద్‌ తెరకెక్కించిన ‘ఊరు పేరు భైరవకోన’ ఫిబ్రవరి 16న విడుదల కానుంది. వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్‌ హీరోయిన్లు. ఇప్పటికే కొన్ని చోట్ల పెయిడ్‌ ప్రీమియర్స్‌ వేయగా, మంచి టాక్‌ సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని