Oppenheimer: మరోసారి సత్తా చాటిన ఓపెన్‌హైమర్‌

Oppenheimer: 77వ బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డుల్లో ఏడు విభాగాల్లో ఓపెన్‌హైమర్‌ సత్తా చాటింది. ఆస్కార్‌ రేసులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.

Updated : 19 Feb 2024 09:34 IST

Oppenheimer | లండన్‌: లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో 77వ బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డుల (BAFTA) ప్రదానోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన బయోగ్రాఫికల్‌ థ్రిల్లర్‌ ‘ఓపెన్‌హైమర్‌’ (Oppenheimer) చిత్రం ఈ అవార్డుల్లోనూ సత్తా చాటింది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ స్కోర్‌ సహా మొత్తం ఏడు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. నోలన్‌కు దర్శకుడిగా ఇదే తొలి BAFTA అవార్డు. ఇప్పటికే అత్యధిక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు గెలుచుకున్న ‘ఓపెన్‌హైమర్‌’ వచ్చే నెల జరిగే ఆస్కార్‌ రేసులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ‘పూర్‌ థింగ్స్‌’కు అయిదు, ‘ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’కు మూడు పురస్కారాలు దక్కాయి.

విజేతలు వీరే..

  • ఉత్తమ చిత్రం - ఓపెన్‌హైమర్‌
  • ఉత్తమ దర్శకుడు - క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ నటుడు - సిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ నటి - ఎమ్మా స్టోన్‌ (పూర్‌ థింగ్స్‌)
  • ఉత్తమ సహాయ నటుడు - రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ సహాయ నటి - డావిన్‌ జాయ్‌ రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)
  • ఉత్తమ స్కోర్‌ - లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ - హోట్‌ వాన్‌ హోటిమా (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే - జస్టిన్‌ ట్రైట్‌, ఆర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఫాల్‌)
  • ఉత్తమ డాక్యుమెంటరీ - 20 డేస్‌ ఇన్‌ మరియోపోల్‌
  • ఉత్తమ క్యాస్టింగ్‌ - ది హోల్డోవర్స్‌
  • ఉత్తమ ఎడిటింగ్‌ - జెన్నీఫర్‌ లేమ్‌ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ మేకప్‌ - నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ - సైమన్‌ హ్యూస్
  • ఉత్తమ సౌండ్‌ - జానీ బర్న్‌, టార్న్‌ విల్లర్స్‌ (ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని