Disney+ Hotstar: కనుమరుగుకానున్న సూపర్‌హిట్‌ సిరీస్‌లు.. అదే చివరి రోజు

‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’సహా పలు హాలీవుడ్‌ సిరీస్‌లు ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో మరికొన్ని రోజుల్లో కనుమరుగుకానున్నాయి. ఎప్పటి నుంచి? ఎందుకంటే?

Published : 11 Mar 2023 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో పలు సూపర్‌హిట్‌ సిరీస్‌లు, షోలు మరికొన్ని రోజుల్లో కనుమరుగుకానున్నాయి. ఇంతకాలం స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉన్న హెచ్‌బీఓ (HBO) కంటెంట్‌ ఈ నెల 31 నుంచి కనిపించదు. ఈ విషయాన్ని సదరు సంస్థ ఇటీవల వెల్లడించింది. విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’సహా (Game of Thrones) 50కిపైగా సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, షోలు ఉండవన్న వార్త తెలిసిన సినీ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు. మీరూ హాలీవుడ్‌ కంటెంట్‌ను ఇష్టపడేవారైతే.. ప్రసారం నిలిపివేసేలోపు వాటిపై ఓ లుక్కేయండి..

ఆ జాబితా ఇదీ..

2016 నుంచి..

డిస్నీస్టార్‌ 2015 డిసెంబరులో హెచ్‌బీఓతో ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు హెచ్‌బీఓ ఒరిజినల్స్‌ను 2016 నుంచి  డిస్నీస్టార్‌ ప్రసారం చేస్తోంది. 2020లో హాట్‌స్టార్‌.. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌గా మారిన తర్వాత హెచ్‌బీఓ కంటెంట్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా సదరు సంస్థ హెచ్‌బీఓ కంటెంట్‌ను తొలగిస్తుందని తెలుస్తోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ హక్కులను సైతం ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్‌ వదులుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని