ott movies this week: ఈ వారం ఓటీటీలో ఏకంగా 23 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు!

ott movies this week: థియేటర్‌లలో అగ్ర కథానాయకుల సినిమాలు సందడి చేస్తున్న వేళ, ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు,సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

Published : 10 Aug 2023 13:40 IST

సూపర్‌హిట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ తెలుగులో..

ఆద్యంతం ఉత్కంఠతో అలరించే క్రైమ్‌ థ్రిల్లర్స్‌కు ఇటీవల విశేష ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కథతోనే ఇటీవల తమిళంలో వచ్చిన చిత్రం ‘పొర్‌ తొళిల్‌’ (por thozhil ott release date). శరత్‌కుమార్‌, అశోక్‌ సెల్వన్‌, నిఖిలా విమల్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 11 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.


నెట్‌ఫ్లిక్స్‌ యాక్షన్‌ మూవీ ‘హార్ట్‌ ఆఫ్ స్టోన్‌’

అలియా భట్‌ (Alia bhatt), గాల్‌ గాడాట్‌ కీలక పాత్రల్లో నటించిన  స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ (Heart of Stone).  ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌, తెలుగుతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.


శోభిత ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌2’

విభిన్నమైన కథతో నాలుగేళ్ల క్రితం విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’. ఈ వెబ్‌ సిరీస్ మొదటి సీజన్‌ను అద్భుతమైన ట్విస్ట్‌తో ముగించారు మేకర్స్‌. దీంతో దీని రెండో సీజన్‌ (Made in Heaven Season 2) కోసం ప్రేక్షకులు ఎదురుచూశారు.  తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) నటించిన ఈ సిరీస్‌ ఆగస్టు 10 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ కానుంది.


ఓటీటీలో అలరించేందుకు..

అశ్విన్‌బాబు హీరోగా అనిల్ క‌న్నెగంటి తెర‌కెక్కించిన సినిమా ‘హిడింబ’ (Hidimba). ఇటీవల విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్‌ ఆగస్టు 10వ తేది రాత్రి 7గంటల నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. నందితా శ్వేత హీరోయిన్‌గా నటించగా..రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె, దీప్తి నల్లమోతు ముఖ్య పాత్రల్లో కనిపించారు.


ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు

 • నెట్‌ఫ్లిక్స్‌
 • జాంబీవెర్స్‌ (కొరియన్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
 • లేడీస్‌ ఫస్ట్‌ - ఏ స్టోరీ ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌హిప్‌ హాప్‌ (ఇంగ్లీష్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
 • మెక్‌ క్యాడెట్స్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 10
 • పెయిన్‌ కిల్లర్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 10
 • పద్మిని (మలయాళం) ఆగస్టు 11
 • పెండింగ్‌ ట్రైన్‌ (మూవీ) ఆగస్టు 11
 • ఇన్‌ అనదర్‌ వరల్డ్‌ విత్‌ మై స్మార్ట్‌ ఫోన్‌ (మూవీ) ఆగస్టు 11
 • జీ5
 • ది కశ్మీర్‌ ఫైల్స్‌ అన్‌ రిపోర్టెడ్‌ (జీ ఒరిజినల్‌) ఆగస్టు 11
 • అబర్‌ ప్రోలీ (బెంగాలీ) ఆగస్టు 11
 • సోనీలివ్‌
 • ది జంగబూరు కర్స్‌ (సోనీలివ్‌ ఒరిజినల్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
 • ది ఫేబుల్‌మ్యాన్స్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 11
 • బ్రోకర్‌ (కొరియన్‌) ఆగస్టు 11
 • కాన్ఫిడెన్షియల్‌ అస్సైన్‌మెంట్‌ 2 (ఇంగ్లీష్‌) ఆగస్టు 11
 • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
 •  రెడ్, వైట్‌ అండ్‌ రాయల్‌ బ్లూ (ఇంగ్లీష్‌) ఆగస్టు 11
 • మావీరన్‌ (తమిళ్‌/తెలుగు) ఆగస్టు 11
 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • నెయ్‌మార్‌ (మలయాళం) స్ట్రీమింగ్‌ అవుతోంది.
 • లయన్స్‌ గేట్‌ ప్లే
 • హై హీట్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 11
 • రిడింప్షన్‌ (ఇంగ్లీష్‌)ఆగస్టు 11
 • సేఫ్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 11
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని