Panchathantram: ‘పంచతంత్రం’ ఓటీటీ రిలీజ్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

‘పంచతంత్రం’ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. గతేడాది డిసెంబరులో థియేటర్లలో విడుదలైన ఈ  చిత్రం అతి త్వరలోనే స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 15 Mar 2023 23:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, నరేశ్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘పంచతంత్రం’ (Panchathantram). గతేడాది డిసెంబరు 9న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల్ని అలరించిన ఈ ఆంథాలజీ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. మార్చి 22 నుంచి ‘ఈటీవీ విన్‌’ (ETV Win) యాప్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ‘మనసుని హత్తుకునే ఐదు కథల అందమైన చిత్రం’ అంటూ ఈటీవీ విన్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ విడుదల చేసింది. ఐదు కథల సమాహారంగా హర్ష పులిపాక ఈ సినిమాని తెరకెక్కించారు.

ఇదీ కథ: కెరీర్‌ని ఇర‌వై యేళ్ల వ‌య‌సులోనే కాదు.. అర‌వైల్లోనూ మొద‌లు పెట్టొచ్చనే ఆలోచ‌న ఉన్న వ్యక్తి వేద వ్యాస్ మూర్తి (బ్రహ్మానందం). కూతురు రోషిణి (స్వాతి)తో క‌లిసి జీవిస్తుంటాడు. రిటైర్మెంట్ త‌ర్వాత స్టాండ‌ప్ స్టోరీ టెల్లింగ్ పోటీల‌కు వెళ‌తాడు. ఎంత పోటీ ఉన్నా త‌న అనుభ‌వాన్నంతా రంగ‌రించి క‌థ‌లు చెప్పడం మొద‌లుపెడ‌తాడు. మరి, ఆ పోటీల్లో నెగ్గారా? ఆ క‌థ‌ల్లో విహారి (న‌రేష్ అగ‌స్త్య‌) - సుభాష్ (రాహుల్ విజ‌య్‌), లేఖ (శివాత్మిక రాజశేఖ‌ర్‌), రామ‌నాథం (స‌ముద్రఖ‌ని), ఆయ‌న భార్య మైత్రి (దివ్యవాణి), శేఖ‌ర్ (వికాస్‌), ఆయ‌న భార్య దేవి (దివ్య శ్రీపాద‌) జీవితాలు ఏం చెప్పాయి? అన్నదే మిగతా కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు