Pankaj Tripathi: ‘మీర్జాపుర్‌’ నటుడి ఇంట విషాదం

బాలీవుడ్‌ నటుడు, ‘మీర్జాపుర్‌’ ఫేమ్‌ పంకజ్‌ త్రిపాఠి (Pankaj Tripathi) ఇంట విషాదం నెలకొంది.

Published : 21 Apr 2024 11:23 IST

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు పంకజ్‌ త్రిపాఠి (Pankaj Tripathi) ఇంట విషాదం నెలకొంది. ఆయన బావ రాజేశ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, సోదరి సరితకు తీవ్ర గాయాలయ్యాయి. బిహార్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ‘‘రాజేశ్‌-సరిత దంపతులు శనివారం సాయంత్రం బిహార్‌లోని గోపాల్‌ఘంజ్‌ జిల్లా నుంచి కారులో పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరారు. దిల్లీ-కోల్‌కతా జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు’’ అని వివరించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షత్రగాత్రులను ఆస్పత్రికి తరలించామని.. అప్పటికే రాజేశ్‌ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారన్నారు. సరితకు కాలు విరిగిందని ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని