Parineeti Chopra: ఆ విషయంలో విద్యాబాలన్‌ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా

‘అమర్‌సింగ్‌ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Updated : 17 Apr 2024 16:41 IST

ముంబయి: వివాహం తర్వాత ‘అమర్‌సింగ్‌ చంకీల’ సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమా విశేషాలు, తనపై వచ్చిన వదంతుల గురించి మాట్లాడారు.

‘‘ఇంతియాజ్‌ అలీ నన్ను సంప్రదించినప్పుడు.. అమర్‌జ్యోత్‌ కౌర్‌ పాత్ర కోసం 15 కేజీల బరువు పెరగాలని తెలిపారు. మేకప్‌ వేసుకోకూడదన్నారు. దానిని నేను అంగీకరించా. స్క్రీన్‌పై లావుగా కనిపిస్తే కెరీర్‌ అక్కడితో ఆగిపోయినట్లేనని చాలామంది అన్నారు. నటి విద్యాబాలన్‌ను స్ఫూర్తిగా తీసుకున్నా. ఎన్నో విమర్శలు వచ్చినపప్పటికీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ‘డర్టీ పిక్చర్‌’ కోసం ఆమె బరువు పెరిగారు. అదేవిధంగా నేనూ పాత్ర కోసం సన్నద్ధమయ్యా. ఈ ప్రాజెక్ట్‌ కోసం దాదాపు రెండేళ్లు శ్రమించా. ఎన్నో ఆఫర్స్‌ వదులుకున్నా. ప్రెగ్నెన్సీ, ప్లాస్టిక్‌ సర్జరీ రూమర్స్ ఎదుర్కొన్నా. బరువు పెరగడంతో నేను నాలా కనిపించలేకపోయా. కెమెరా ముందుకు రాలేదు. రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్స్‌లో పాల్గొనలేదు. అందుకు నేనేమీ బాధపడటం లేదు. ఎందుకంటే నాకు రెడ్ కార్పెట్ ఈవెంట్స్‌ కంటే చంకీల లాంటి గొప్ప చిత్రాలే కావాలి’’ అని ఆమె చెప్పారు.

 రాఘవ చద్ధాను వివాహం చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. ‘‘రాఘవ్‌ను తొలిసారి చూసినప్పుడు.. అతడు రాజకీయ నాయకుడనే విషయం నాకు తెలియదు. పాలిటిక్స్ నేను పెద్దగా ఫాలో కాను. ఇప్పుడిప్పుడే రాజకీయాలపై అవగాహన తెచ్చుకుంటున్నా. ఆయనకు సినిమాలపై అంత ఆసక్తి లేదు. చివరగా ఎప్పుడు సినిమా చూశారో నాకు తెలియదు’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని