Parineeti Chopra: ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!

తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై నటి పరిణీతి చోప్రా స్పందించారు.

Published : 28 Mar 2024 20:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) స్పందించారు. తన తాజా చిత్రం ‘అమర్‌సింగ్ చంకీల’ ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి పరిణీతి వేసుకొచ్చిన దుస్తులు చూసి.. ‘తల్లి కానున్నారా’, ‘బేబీ బంప్‌’ కనిపించకుండా ఇలాంటి డ్రెస్‌ వేసుకున్నారా అంటూ కొందరు నెటిజన్లు పోస్ట్‌లు పెట్టారు. మరికొందరు ఆ పోస్ట్‌లకు ఆమెను ట్యాగ్‌ చేయడం ప్రారంభించారు. దీంతో తన ఇన్‌స్టా వేదికగా ఆమె ఈ వార్తలకు చెక్‌ పెట్టారు. 

‘ఫ్యాషన్‌ కోసం వదులుగా ఉండే దుస్తులు వేసుకున్నా.. పెద్ద సైజ్‌ డ్రెస్‌ ధరించినా.. సౌకర్యవంతంగా ఉండే ఇండియన్ కుర్తా వేసుకున్నా ప్రెగ్నెన్సీ అనే భావిస్తారా’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు. దీంతో ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది. గతేడాది సెప్టెంబర్‌లో ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha)ను ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిణీతి ‘అమర్‌సింగ్ చంకీల’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమె 10 కేజీల బరువు పెరిగినట్లు సహనటుడు దిల్జిత్ దొసాంజ్ తెలిపారు. 27 ఏళ్ల వయసులోనే హత్యకు గురైన సింగర్‌ అమర్‌ సింగ్ చంకీల జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని ఇంతియాజ్‌ అలీ తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది విడుదల కానుంది. తాజాగా దీని ట్రైలర్‌ రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని