Parvathy Thiruvothu: పచ్చదనంతో నిండిన ‘ధూత’ నటి ఇంటిని చూశారా..!

‘దూత’ ఫేమ్‌ పార్వతి తిరువత్తు తాజాగా తన ఇంటిని చూపించారు.

Published : 23 Mar 2024 15:32 IST

ఇంటర్నెట్‌డెస్క్: ‘దూత’ వెబ్‌సిరీస్‌తో తెలుగు వారికి చేరువైన కేరళ భామ పార్వతి తిరువత్తు (Parvathy Thiruvothu). కొచ్చిలో నివసిస్తున్న ఆమె తాజాగా హోమ్‌ టూర్‌ నిర్వహించారు. షూటింగ్స్‌లో కష్టపడి ఇంటికిరాగానే ప్రశాంత వాతావరణం ఉండేలా దీనిని డిజైన్‌ చేసినట్లు చెప్పారు. వారసత్వంగా వచ్చిన వస్తువులతోనే ఇంటిని అలంకరించారు. మూడు పడకల గదులతో ఉన్న ఈ ఇంట్లో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంటుంది. మొక్కలంటే తనకు ఎంతో ఇష్టమని అందుకే తన నివాసంలో వాటికి ఎక్కువ స్థలం కేటాయించినట్లు చెప్పారు. మామిడి, సలాడ్‌కు అవసరమైన చాలా పండ్లు తన బాల్కనీలోనే ఉన్నాయని తెలిపారు. దాదాపు 36 మొక్కలకు తాను తల్లిని అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘ఇల్లు అందంగా ఉంది’’, ‘‘చక్కగా డిజైన్‌ చేశారు’’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

2006లో విడుదలైన ‘ఔట్‌ ఆఫ్‌ సిలబస్‌’ అనే మలయాళ చిత్రంతో పార్వతి నటిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే మంచి పేరు సొంతం చేసుకున్న ఆమె తమిళం, కన్నడ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. గతేడాది విడుదలైన ‘దూత’ సిరీస్‌ ఆమెను తెలుగు వారికీ చేరువ చేసింది. ఇందులో క్రాంతి అనే పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని