Pathaan 2: ఆ మూవీ కన్నా ముందే ‘పఠాన్‌2’

Pathaan 2: షారుక్‌ఖాన్‌ కీలక పాత్రలో నటించిన ‘పఠాన్‌’కు సీక్వెల్‌గా ‘పఠాన్‌2’ పట్టాలెక్కనుంది.

Updated : 20 Feb 2024 15:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షారుక్‌ఖాన్‌ (Shah Rukh Khan) కథానాయకుడిగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్‌’ (Pathaan). దీపిక పదుకొణె కథానాయిక. జాన్‌ అబ్రహాం ప్రతినాయకుడిగా నటించారు. గతేడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

యశ్‌ రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పఠాన్‌2’ (Pathaan 2) పట్టాలెక్కనుందట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను కూడా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ మొదలు పెట్టినట్లు బాలీవుడ్‌ టాక్‌. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరి నాటికి ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది. యశ్‌ రాజ్‌ స్పై యూనివర్స్‌లో ఇదొక కీలక చిత్రంగా నిలవనుందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. భారీ బడ్జెట్‌తో సరికొత్త టెక్నాలజీతో ఈ మూవీని తీయనున్నారని చెబుతున్నారు. సల్మాన్‌, షారుక్‌ కలిసి నటించే చిత్రం ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’ కన్నా ముందే ఈ సినిమాను పూర్తి చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని