Pawan Kalyan: నిర్మాతల నుంచి పవన్‌కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?

Updated : 23 Apr 2024 18:30 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఆయన తన నామినేషన్‌ సమర్పించారు. ఈసందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు, అప్పుల వివరాలను పంచుకున్నారు. సినిమాలతో పాటు, వివిధ వ్యక్తిగత అవసరాల కోసం పవన్‌ రూ.46.70 కోట్ల అప్పు చేసినట్లు అఫిడవిట్‌లో తెలిపారు. అత్యధికంగా విజయ్‌ లక్ష్మి వి.ఆర్‌. నుంచి రూ.8 కోట్లు అప్పుగా చేయగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి రూ.10 లక్షలు మాత్రమే తీసుకున్నారు. చిరంజీవి సతీమణి, పవన్‌ వదిన వద్ద రూ.2 కోట్లు అప్పు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

ఇక పవన్‌ సినిమాల విషయానికొస్తే, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’, సుజీత్‌ దర్శకత్వంలో ‘ఓజీ’, క్రిష్‌ దర్శకత్వంలో ‘హరి హరి వీరమల్లు’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు, రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. వీటితో పాటు, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను కూడా ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని