Pawan Kalyan: హరీశ్‌ శంకర్‌ బాధ భరించలేక ఆ డైలాగ్‌ చెప్పా: పవన్‌కల్యాణ్‌

సినీ ప్రియులను సర్‌ప్రైజ్ చేస్తూ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) నుంచి మంగళవారం సాయంత్రం పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ప్రోమో విడుదలైన విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి పవన్‌కల్యాణ్‌ (Pawankalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 20 Mar 2024 09:59 IST

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) - హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న యాక్షన్‌ డ్రామా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad BhagatSingh). మంగళవారం సాయంత్రం ఈ సినిమా నుంచి పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ప్రోమో విడుదలైంది. దీనిని ఉద్దేశించి ఓ రాజకీయ కార్యక్రమంలో పవన్‌కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్‌ చెప్పడం పెద్దగా ఇష్టం ఉండదన్నారు.

సినిమాలోని ఒక సీన్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఒక వ్యక్తి గాజు గ్లాస్‌ కింద పడేస్తాడు. అది ముక్కలవుతుంది. షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఈ సీన్ ఎందుకు రాశావు అని హరీశ్‌ శంకర్‌ను అడిగా. ‘‘అందరూ మీరు ఓడిపోయారు అంటున్నారు. వాళ్లందరికీ నేను ఒక్కటే చెబుతున్నా. గాజుకు ఉన్న లక్షణం ఏమిటంటే.. పగిలేకొద్ది పదునెక్కిద్ది. మీ నుంచి మేము ఇలాంటివి కోరుకుంటాం. మీరు తగ్గితే మాకు నచ్చదు’’ అని హరీశ్‌ చెప్పాడు. సాధారణంగా సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్‌ చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ, హరీశ్‌ శంకర్‌ బాధపడలేక ఆ డైలాగ్‌ చెప్పా’’ అని అన్నారు.

‘గబ్బర్‌ సింగ్‌’ తర్వాత పవన్‌కల్యాణ్‌ - హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. భగత్‌సింగ్‌ అనే పోలీస్‌ పాత్రలో పవన్‌కల్యాణ్‌ కనిపించనున్నారు. శ్రీలీల కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ కొనుగోలు చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ ఈవెంట్‌లో భాగంగా డైలాగ్‌ ప్రోమో విడుదల చేశారు. ఇందులో పాల్గొన్న హరీశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నాకెంతో స్పెషల్‌. దాదాపు పదేళ్ల తర్వాత నా అభిమాన హీరోతో సినిమా చేస్తున్నా. సంగీతంతో దేవి ఈ చిత్రానికి ప్రాణం ఇచ్చాడు. నిర్మాతలు రవి, నవీన్‌ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని