Payal Rajput: వివాదంలో పాయల్‌ రాజ్‌పూత్‌

నటి పాయల్‌ రాజ్‌పూత్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె గతంలో ప్రణదీప్‌ ఠాకూర్‌ దర్శక నిర్మాణంలో ‘రక్షణ’ (5వైస్‌) అనే చిత్రంలో నటించింది.

Updated : 21 May 2024 01:21 IST

నటి పాయల్‌ రాజ్‌పూత్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె గతంలో ప్రణదీప్‌ ఠాకూర్‌ దర్శక నిర్మాణంలో ‘రక్షణ’ (5వైస్‌) అనే చిత్రంలో నటించింది. రకరకాల కారణాలతో ఆలస్యమైన ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. అయితే ఇప్పుడీ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పాయల్‌ నిరాకరిస్తున్నట్లు చిత్ర నిర్మాత, దర్శకుడు ప్రణదీప్‌ ఠాకూర్‌ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. పాయల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆమె ఈ సినిమా చిత్రీకరణకు.. ప్రచార కార్యక్రమాలకు కలిపి 50రోజుల పాటు పని చేయాల్సి ఉందని.. ఇందులో ఇప్పటికే 47రోజుల పాటు తన సేవల్ని ఉపయోగించుకున్నామని.. మిగిలిన 3రోజులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాలని కోరగా తిరస్కరించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మరోవైపు పాయల్‌ సోమవారం ఉదయం ఈ చిత్ర విషయమై సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని ఆరోపణలు చేశారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా ‘రక్షణ’ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారని, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారని.. తెలుగు సినిమా నుంచి తనను బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆరోపించారు. దీంతో ఈ వివాదంపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పందించింది. చిత్ర బృందంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పాయల్‌ గౌరవించాల్సి ఉందని.. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని తెలిపింది. కానీ, ఆమె తెలుగు చలన చిత్ర పరిశ్రమ తనని నిషేధించడానికి ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేయడం తమకు దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు