Kamal Haasan: కమల్ హాసన్‌ బర్త్‌డే స్పెషల్.. ప్రభాస్‌ విషెస్‌ వైరల్‌

కమల్‌ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 07 Nov 2023 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెండితెరపై తన నటనతో విశ్వరూపం చూపే హీరో కమల్‌ హాసన్‌ (kamal haasan) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నటీనటులు ఆయనతో దిగిన ఫొటోలను పంచుకుంటూ విషెస్ చెబుతున్నారు. మరోవైపు ఆయన కొత్త సినిమా అప్‌డేట్‌లు కూడా సందడి చేస్తున్నాయి.

కమల్‌ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్‌ (Shruti Haasan) ఓ ప్రత్యేక వీడియోతో తండ్రికి బర్త్‌డే విషెస్‌ చెప్పారు. ‘మీలాంటి గొప్పవారు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. హీరోగా, సింగర్‌గా, డ్యాన్స్‌ర్‌గా, అన్నింటికి మించి మంచి స్నేహితుడిగా.. ఇలా అన్ని విషయాల్లో మీరు ఉత్తమంగా ఉంటారు. మీలాంటి తండ్రి ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. మీరు నా జీవితంలో స్ఫూర్తి నింపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలి. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మీరు నిజంగా అన్ని విషయాల్లో రాక్‌స్టార్‌’ అంటూ కమల్ హాసన్‌ అరుదైన చిత్రాలతో కూడిన ఓ వీడియోను పోస్ట్‌ చేశారు (#HBDUlaganayagan).

* మీతో కలిసి మరోసారి మళ్లీ పనిచేసే అవకాశం రావడం అద్భుతంగా ఉంది. మీరు మమ్మల్ని అలరిస్తూనే ఉంటారని.. మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు. - దర్శకుడు శంకర్‌

* నటుడు, లెజెండ్, ఎంతోమందికి ఆరాధ్య దైవంగా ఎదిగిన ఐకాన్‌కి శుభాకాంక్షలు. మీతో కలిసి పనిచేయం అదృష్టంగా భావిస్తున్నాను. - ప్రభాస్ (Prabhas)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని