Prabhas: తుది అంకానికి సన్నద్ధం

ప్రభాస్‌ మరో దఫా సెట్స్‌లో అడుగు పెట్టి తన చిత్రాన్ని పరుగులు పెట్టించనున్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఎ.డి’ ఇప్పటికే విడుదల తేదీ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.

Updated : 05 Feb 2024 09:15 IST

ప్రభాస్‌ మరో దఫా సెట్స్‌లో అడుగు పెట్టి తన చిత్రాన్ని పరుగులు పెట్టించనున్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఎ.డి’ ఇప్పటికే విడుదల తేదీ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. మే 9న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తుండడంతో చిత్రబృందం మిగిలిన చిత్రీకరణని పూర్తి చేసే పనిలో ఉంది. సినిమాలోని తారాగణం మొత్తం పాల్గొననున్న కీలకమైన షెడ్యూల్‌ కోసం చిత్రబృందం కసరత్తులు మొదలుపెట్టింది. వచ్చే వారం నుంచే ఈ షెడ్యూల్‌ మొదలు కానున్నట్టు సమాచారం. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీతోపాటు... సినిమాలోని అతిథి పాత్రలు పోషిస్తున్న మరికొద్దిమంది కథానాయకులపై కూడా సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా పూర్తి కానుందని సమాచారం. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో... వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్న చిత్రమిది. సైన్స్‌ ఫిక్షన్‌ కథతో పురాణాలు, భవిష్యత్తు ఆధారంగా రూపొందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని