Salaar: ‘సలార్‌’.. ప్రభాస్‌ డైలాగ్స్‌ మొత్తం ఒకే వీడియోలో..

సినీ అభిమాని ఒకరు.. ‘సలార్‌’ చిత్రంలో ప్రభాస్‌ చెప్పిన డైలాగ్స్‌ అన్నింటినీ ఓకే వీడియోలో పొందుపరిచారు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అది వైరల్‌ అయింది.

Published : 22 Jan 2024 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సలార్‌’ (Salaar) జోరు ఇంకా తగ్గలేదు. ఏదో విధంగా నెట్టింట్లో ట్రెండింగ్‌ అవుతూనే ఉంది. ప్రస్తుతం.. డైలాగ్స్‌ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సినిమాలో ప్రభాస్‌ చెప్పిన డైలాగ్స్‌ (Salaar Dialogues) అన్నింటినీ ఒకే వీడియోలో పొందుపరిచిన సినీ అభిమాని ఒకరు దాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ లో పోస్ట్‌ చేశారు. ప్రభాస్‌ అభిమానులు, సినీ ప్రియులు సంబంధిత వీడియోను లైక్‌ చేసి, షేర్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. ప్రభాస్‌ చెప్పిన మొత్తం సంభాషణల నిడివి దాదాపు నాలుగు నిమిషాలు. వాటిని ఈ వీడియోలో 2:35 నిమిషాలకు కుదించారు. హీరో క్యారెక్టర్‌కు తక్కువ డైలాగ్స్‌ ఉన్నాయంటూ సినిమా విడుదలైన రోజే ఆసక్తికర చర్చ జరిగింది.

ఖాన్సార్‌ సామ్రాజ్యం నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలో విడుదలైన హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌ (Salaar on Netflix)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం దేవ పాత్రలో ప్రభాస్‌ చెప్పిన డైలాగ్స్‌ మీరూ వినేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని