Jai Hanuman: మాటిస్తున్నా..: ‘జై హనుమాన్‌’పై ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌

ప్రశాంత్‌ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే.

Published : 17 Apr 2024 14:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘హనుమాన్‌’ (Hanuman)కు కొనసాగింపుగా దర్శకుడు ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) తెరకెక్కించనున్న చిత్రం ‘జై హనుమాన్‌’ (Jai Hanuman). శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ ప్రియులకు ఆయన మాటిచ్చారు. ‘‘ఆ శ్రీరాముడి ఆశీస్సులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులకు నేను మాటిస్తున్నా. జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ‘జై హనుమాన్‌’తో అద్భుతమైన అనుభూతిని అందిస్తా. మనందరికీ  ఈ సినిమా ఎంతో ప్రత్యేకం కానుంది’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ఈమేరకు రాముడికి హనుమంతుడు మాటిస్తున్నట్టుగా ఉన్న ఓ స్పెషల్‌ పోస్టర్‌ను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తుంది.

తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన సూపర్‌ హీరో చిత్రం ‘హనుమాన్‌’. సంక్రాంతి కానుకగా విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ‘శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్‌’ రూపుదిద్దుకోనుంది. 2025లో విడుదల కానుంది. జనవరి నెలలోనే ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయి. త్వరలోనే షూట్‌ ప్రారంభించనున్నారు. గత చిత్రంతో పోలిస్తే సీక్వెల్‌ 100 రెట్లు భారీ స్థాయిలో ఉంటుందని ప్రశాంత్‌ గతంలో చెప్పారు. హనుమంతుడి పాత్రలో స్టార్ హీరో యాక్ట్‌ చేస్తారన్నారు.

సూపర్‌ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి తీసిన చిత్రం ‘హను-మాన్‌’ (Hanuman). తేజ సజ్జా హీరోగా నటించగా.. అమృతాఅయ్యర్‌ కథానాయిక పాత్ర పోషించారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, వినయ్‌రాయ్‌, గెటప్‌ శ్రీను, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో కనిపించారు. రూ.40 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు